9 June, 2026 | 3:00 AM

తుంగభద్ర తీరంలో అక్రమ ఇసుక రవాణా చర్యలు తీసుకోవాలని వినతి

09-06-2026 12:08 AM

అలంపూర్, జూన్ 8: రాజోలి మండల పరిధిలోని తుంగభద్ర నది తీరం నుంచి జరుగుతున్న అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. సోమవారం బీజేపీ మండల అధ్యక్షుడు కనికే శశికుమార్ ఆధ్వర్యంలో తహసిల్దార్ రామ్మోహన్, ఎస్‌ఐ గోకారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షుడు సంజీవరెడ్డి మాట్లాడుతూ, అనుమతులు లేకుండా పెద్ద ఎత్తున ఇసుకను తరలిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని ఆరోపించారు.

స్థానిక ప్రజలకు ఇసుక అందుబాటులో లేకపోయినా, ఇతర ప్రాంతాలకు విక్రయిస్తున్నారని తెలిపారు. అక్రమ ఇసుక రవాణా వల్ల రహదారులుదెబ్బతింటున్నాయని, ప్రమాదాల భయం పెరుగుతోందని అన్నారు. అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణాపై రెవెన్యూ, పోలీస్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఆంజనేయులు, కొంకతిరామ్, గోవిందరాజులు, వినోద్ స్వామి తదితరులు పాల్గొన్నారు.