అన్నం పరబ్రహ్మ స్వరూపం
29-07-2026 08:48 AM
కూటి కోసం కోటి విద్యలు సమస్త ప్రాణకోటి నినాదం*
అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న...
కొత్తగూడెం,విజయక్రాంతి: భద్రాద్రికొత్తగూడెం జిల్లా జిల్లా ప్రధాన కార్యాలయంలో బస్టాండ్, రైల్వే స్టేసన్ పరిధిలో, ఉన్న శరణార్థులకు మానవతా దృక్పథంతో,మానవత్వం చాటిన జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్ కారం.రాజారావు, అన్ని దానాల్లో కన్నా అన్నదానం మిన్న, ఆకలితో ఎవరు అలమటించకూడదు అనే ఉద్దేశ్యంతో, తన వంతు సహకారంగా,ప్రతి మంగళవారం శరణార్ధులకు ఆకలి బాధలు తీరుస్తున్న జిల్లా అధికారికి ధన్యవాదాలు తెలిపారు. శరణార్ధులకు దానం చేసే మంచి ఆలోచనలు అందరిలో ఉండాలి అని, మానవత్వం చాటాలి పిలుపునిచ్చారు.






