తూతూ మంత్రంగా ప్రత్యేక సమావేశం
బీబీపేట,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు బీబీపేట మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం ప్రత్యేక సమావేశాన్ని స్థానిక ఎంపీడీవో నరేష్ నిర్వహించారు. ఇట్టి సమావేశానికి మండలంలోని అన్ని శాఖల అధికారులు రాలేదు. గ్రామాల సర్పంచులను, సమావేశానికి హాజరైన శాఖల అధికారులను ఈ సమావేశం ద్వారా పరిచయా వేదిక నిర్వహించారు. కాగా ఇట్టి సమావేశానికి వ్యవసాయ శాఖ అధికారి, ఎక్సైజ్ శాఖ, ఫారెస్ట్ శాఖ, ఉద్యానవన శాఖ, విద్యాశాఖ అధికారులు గైరాజాలు కాగా సర్పంచులు మల్కాపూర్, మహమ్మదాపూర్, శివారు రామిరెడ్డిపల్లి, షేర్ బీబీపేట్ సర్పంచులు గైరాజరయ్యారు. దీంతో తూ తూ మంత్రంగా సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో వర్షాకాలం కాబట్టి విద్యుత్ బ్రేకర్లను మండల కేంద్రంలో అక్కడక్కడ ఏర్పాటు చేయాలని, మండలంలో ఎక్కడైనా రోడ్ల పక్కన ఇనుప స్తంభాలు ప్రమాదంగా కనిపిస్తే తమ దృష్టికి తీసుకురావాలని విద్యుత్ శాఖ అధికారి తెలియజేశారు.
ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాలలో పనులను గుర్తించాలని స్థానిక ఎంపీడీవో నరేష్ తెలియజేశారు. పంటపొ నీటి నిల్వ సామర్థ్యం కలిగిన ఫాంపండ్,పంటకాలువలు నిర్మాణం,చేపల చెరువుల నిర్మాణం,పండ్ల తోటలు,పూల తోటలు సాగుకు కృషిచేయాలి మండల ప్రత్యేక అధికారి శ్రీనివాస్ తెలియజేశారు. అనంతరం గత వర్షాకాలంలో ధ్వంసమైన రోడ్డు నిర్మాణానికి పూనుకోవాలని ఆర్ అండ్ బి అధికారికి తెలియజేశారు. గ్రామాలకు అవసరమైన చోట్ల బీటీ రోడ్లను మరమ్మతు చేయాలని సూచించారు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, ఎంపీఓ అబ్బ గౌడ్, జనగామ సర్పంచ్ మట్ట శ్రీనివాస్, ఇస్సానగర్ సర్పంచ్ ధర్మ గారి రాజా గౌడ్, బీబీపేట సర్పంచి ఏదుల్ల సాద్విక,గుబ్బూరి సుధారాణి, ఆయా గ్రామాల సెక్రటరీలు రమేష్, కళ్యాణ్ వెన్నెల నరేందర్, ఆపరేటర్లు నాగరాజ్,రాజు, ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.






