జాతీయ రహదారిపై చినుకు పడితే చాలు చిత్తడే
29-07-2026 08:37 AM
తూప్రాన్,(విజయ క్రాంతి): తూప్రాన్ మున్సిపల్(Toopran Municipality) ప్రధాన జాతీయ రహదారిపై చినుకు పడిందంటే చాలు పూర్తిగా నీరు నిలిచి రహదారి చిత్తడి చిత్తడిగా తయారవుతుంది. వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ వెళ్లడం జరుగుతుంది. గత కొంతకాలంగా ఈ సమస్య కొనసాగుతూనే ఉన్న మున్సిపల్ అధికారులు పట్టించుకునే దాఖలాలు లేవు. ఇకనైనా ఈ స్పాట్ ను గుర్తించి తక్షణమే నివారణ చర్యలు చేపట్టాలని పట్టణస్తులు కోరారు.






