15 July, 2026 | 12:00 AM

భువన్ ట్యాక్స్ తగ్గించాలని వినతి

15-07-2026 12:00 AM

షాద్‌నగర్ (జూలై 14): కొత్తూరు మున్సిపాలిటీలో భువన్ ట్యాక్స్ ఆధారంగా పెంచిన ఆస్తి పన్నును తగ్గించాలని బిఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు కడెంపల్లి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ సాయితి రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భువన్ ట్యాక్స్ వల్ల గతంలో రూ.10 వేలు ఉన్న ఆస్తి పన్ను, ప్రస్తుతం రూ.20 వేల నుండి రూ.30 వేల వరకు పెరిగి సామాన్యులపై తీవ్ర భారం పడుతోందన్నారు. శంషాబాద్, షాద్నగర్ తరహాలోనే ఇక్కడ కూడా ప్రజలకు అనుకూలమైన విధానాన్ని అమలు చేసి, పన్నులను పునఃసమీక్షించాలని కోరారు. కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు.