15 July, 2026 | 12:00 AM

కోతుల బెడద నుంచి రక్షించండి

15-07-2026 12:00 AM

మున్సిపల్ కమిషనర్‌కు విద్యానగర్ కాలనీవాసుల విజ్ఞప్తి

ముషీరాబాద్, జూలై 14(విజయక్రాంతి): విద్యానగర్ కాలనీలో గత కొంత కాలం నుంచి కోతులు స్థానిక ప్రజలపై దాడులు చేస్తూ గాయపరుస్తున్నాయని విద్యానగర్ కాలనీవాసులు జిహెచ్‌ఎంసి డిప్యూటీ కమిషనర్ ప్రవీణ్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. మంగళవారం డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో   స్థానిక విద్యానగర్ కాలనీవాసులు ఎం.  నర్సయ్య, మహమ్మద్ ఖదీర్, జైపాల్ రెడ్డి, రోషం బాలు, జి.  వెంకటరమణ, మహేందర్ లు కలిసి వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాలనీలో కోతుల బెడదతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని, వాచ్ మెన్లు డ్యూటీ చేయలేకపోతున్నారని, పని మనుషులు, పారిశుద్ధ్య కార్మికులు ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. దీనికి స్పందించిన డిప్యూటీ కమిషనర్ వెంటనే వెటర్నరీ అధికారులకు ఆదేశాలు జారీచేసి సమస్యను పరిష్కరించాలని సూచించారు.