30 May, 2026 | 6:19 PM

యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ కళాశాలల వేసవి సెలవుల పొడిగించాలని వినతి

30-05-2026 05:28 PM

నల్గొండ టౌన్: మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిధిలో అన్ని డిగ్రీ కళాశాలల వేసవి సెలవులను పొడిగించాలని ప్రభుత్వ కళాశాలల గెజిటెడ్ అధ్యాపకుల సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ ఎస్ రాజారామ్ శనివారం  యూనివర్సిటీ రిజిస్ట్రార్ కొప్పుల అంజిరెడ్డి కీ వినతి పత్రం అందజేశారు. గతంలో మే ఒకటి నుంచి మే 31 వరకు వేసవి సెలవులను మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిధిలో అన్ని డిగ్రీ కళాశాలలకు ఇవ్వడం జరిగిందని  ప్రభుత్వం ప్రగతి పాలనలో భాగంగా, ఈనెల 10వ తారీఖు నుండి 17వ తేదీ వరకు అన్ని డిగ్రీ కళాశాలలో వివిధ  కార్యక్రమాలు అమలు చేయడం జరిగిందన్నారు.

ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలనలో భాగంగా వారం రోజులపాటు అధ్యాపకులు పూర్తిస్థాయిలో పనిచేయడం వల్ల వేసవి సెలవులు తగ్గడం. తెలంగాణలో పలుచోట్ల తీవ్ర ఉష్ణోగ్రతలు వడగాలుల కారణంగా ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు బయటకు ప్రజలు సంచరించవద్దని వాతావరణ శాఖ హెచ్చరిక ఉందని  జూన్ 1 నుండి ప్రారంభం కావలసిన తరగతులను ఒక వారం రోజులపాటు పొడిగించాలని కోరారు. మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిధిలో గల అన్ని డిగ్రీ కళాశాలలో మే జూన్ 11 నుంచి ప్రారంభించాల్సిందిగా విద్యార్థులు  అన్ని కళాశాల అధ్యాపకులనుండి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.