విశిష్ట సేవలకు ఎస్పీ అభినందనలు
నిర్మల్,(విజయక్రాంతి): పోలీస్ శాఖలో పనిచేస్తూ ఆదివారం పదవీ విరమణ పొందనున్న జిల్లా పోలీసు అధికారులకు, జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదరణ సన్మానం చేశారు. సన్మానం అందుకున్న వారిలో 1983 లో గంగాధర్ కానిస్టేబుల్ గా నియామకమై, తర్వాత కాలంలో ఎస్సైగా పదోన్నతి పొంది, ప్రస్తుతం నిర్మల్ టౌన్ లో ఎస్ఐ గా విధులు నిర్వహిస్తున్నారు.దాదాపుగా 43 సంవత్సరాలు,1989 బ్యాచ్ కి చెందిన ఎస్.సుదర్శన్ (ఏ.ఎస్.ఐ) భైంసా టౌన్,37 సంవత్సరాలు,1989 బ్యాచ్ కి చెందిన ఎమ్.గణేష్(ఏ.ఎస్.ఐ),నిర్మల్ టౌన్,37 సంవత్సరాలు,1990 బ్యాచ్ కి చెందిన కె.వి.రాజా రెడ్డి,(హెడ్ కానిస్టేబుల్), లోకేశ్వరం పోలీస్ స్టేషన్,36 సంవత్సరాలు,1990 బ్యాచ్ కి చెందిన బి.మల్లేశ్వర్(హెడ్ కానిస్టేబుల్), మామడ పోలీసు స్టేషన్,36 సంవత్సరాలు పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించి నేడు పదవి విరమణ చేయడం తీరని లోటు అన్నారు. వారు పోలీసు శాఖకు అందించిన సేవలు మారువలేనివని వారి సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ ఉపేందర్ రెడ్డి, ఏవో యూనస్ అలీ, ఆర్.ఐ రామ్ నిరంజన్ రావ్, ఇతర పోలీసు సిబ్బంది,రిటైర్డ్ అవుతున్న కుటుంబసభ్యులు తదితరులు పాల్గొన్నారు.






