మక్కలు వెంటనే తరలించాలని తహసీల్దార్ కు వినతి
22-05-2026 03:12 PM
సదాశివనగర్,(విజయక్రాంతి): మండలంలోని మర్కల్ గ్రామ రైతులు తమ మక్కలను కొనుగోలు కేంద్రల నుండి తరలించాలని కోరుతూ శుక్రవారం తహసీల్దార్ సత్యనారాయణకు వినతి పత్రం అందజేశారు. గత నెల రోజుల నుండి మక్కల కొనుగోలు ప్రారంభించిన ఇప్పటికి అరకొర కొనుగోలు చేసి రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తూకం వేయడంలేదని, తూకం వేసిన మక్కలను లారీలు రాక తరలించడం లేదని, వర్ష కాలం రానున్న నేపథ్యంలో రైతులు నష్ట పోయే అవకాశం ఉందని, వెంటనే మక్కాలను తరలించి రైతులను అదుకోవాలని కోరారు.






