22 May, 2026 | 4:04 PM

హైమాస్ట్ లైట్ల ఏర్పాటుకు స్థల పరిశీలన

22-05-2026 03:07 PM

జైనూర్,(విజయకాంతి): ఎమ్మెల్యే కోవలక్ష్మి కృషితో మండల కేంద్రంలోని పలు కాలనీల కూడళ్లలో హైమాస్ట్ లైట్లు మంజూరయ్యాయి. వాటి ఏర్పాటుకు అనువైన స్థలాలను స్థానిక సర్పంచ్ కొడప ప్రకాష్, మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కనక యాదవరావు, బీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు ఇంతియాజ్ లాలా తదితర నాయకులు గురువారం పరిశీలించారు.

కాలనీల్లో పర్యటించి లైట్లు ఏర్పాటు చేసే స్థలాలను గుర్తించి కాంట్రాక్టర్‌కు సూచనలు చేశారు. ఎప్పుడూ లేని విధంగా ఎమ్మెల్యే కోవలక్ష్మి కృషితో మండల కేంద్రంతో పాటు పలు గ్రామ పంచాయతీలకు హైమాస్ట్ లైట్లు మంజూరయ్యాయని, ఇందుకు ఎమ్మెల్యేకు ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నామని నాయకులు పేర్కొన్నారు.