22 May, 2026 | 4:19 PM

మార్కెట్ కమిటీ చైర్మన్ ను సన్మానించిన బీఆర్ఎస్ నాయకులు

22-05-2026 03:15 PM

బోథ్(విజయక్రాంతి): మార్కెట్ కమిటీ చైర్మన్గా పదవి బాధ్యతలు చేపట్టిన మల్లెపూల సత్యనారాయణ ను శుక్రవారం మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు సన్మానించారు. ఈ సందర్భంగా వారు రైతులకు సరైన న్యాయం జరిగే విధంగా చూడాలని కోరారు. ప్రస్తుతం మార్కెట్ యార్డుల్లో పంట కొనుగోలు జరుగుతున్న ట్రాన్స్పోర్టేషన్ కోసం వాహనాలు రాక ఇబ్బందిగా మారిందని ఈ విషయంలో జిల్లా ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించే దిశగా ఆలోచించాలని కోరారు.