60 గజాల ఇళ్ల స్థలాల బాధితులకు న్యాయం చేస్తాం: మంత్రి శ్రీధర్‌బాబు
మొయినాబాద్ జూలై 28(విజయ క్రాంతి): మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని హిమాయత్నగర్ రెవెన్యూలో సర్వే నంబర్ 151లో 60 గజాల ఇళ్ల స్థలాల కోసం పోరాటం చేస్తున్న బాధితులకు న్యాయం చేస్తామని రాష్ట్ర మంత్రి, రంగారెడ్డి జిల్లా ఇన్చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు.మంగళవారం బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు పట్లోళ్ల కార్తీక్ రెడ్డి ఆధ్వర్యంలో హిమాయత్నగర్ 60 గజాల ఇళ్ల స్థలాల బాధితులు మంత్రి శ్రీధర్ బాబును ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం అందజేశారు.
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పంపిణీ చేసిన 60 గజాల ఇళ్ల స్థలాలకు సంబంధించి స్థలాలు చూపించి న్యాయం చేయాలని కోరారు. మంత్రి శ్రీధర్ బాబును కలిసిన వారిలో బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు కొంపల్లి అనంతరెడ్డి, మండల అధ్యక్షుడు దారెడ్డి వెంకట్ రెడ్డి, కొత్త నరసింహారెడ్డి, ముదిగొండ శ్రీహరి యాదవ్, మాజీ సర్పంచ్ ముదిగొండ మంజుల రవియాదవ్, నరోత్తం రెడ్డి, సుధాకర్ యాదవ్, మాల యాదయ్య, సలీంఖాన్, హిమాయత్నగర్ యువజన సంఘాల అధ్యక్షుడు కొర్ర గోపాల్ నాయక్, కుమ్మరి విఠల్, కట్టమీది శ్రీను, కరీం భాయ్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.






