29 July, 2026 | 1:35 AM

తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్

29-07-2026 12:36 AM
  1. మార్పు కోసం ప్రజల చూపు బీజేపీ వైపు
  2. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు

హుజూర్‌నగర్, జూలై 28 (విజయక్రాంతి): తెలంగాణలో మార్పు కోసం బీజేపీకి అవకాశం కల్పించే దిశగా ప్రజలు ఆలోచన చేస్తున్నారని, రానున్న రోజుల్లో డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు జోస్యం చెప్పారు. మంగళవారం హుజూర్‌నగర్ పట్టణం లో నిర్వహించిన సీనియర్ జనసంఘ, ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో హాజరై మాట్లాడారు.

రాష్ట్రంలో విద్యావంతులు, దేశం కోసం పని చేయాలనుకునే వారు బీజేపీలో చేరుతున్నారని, సైద్ధాంతిక ప్రమా ణాలు కలిగిన ఏకైక పార్టీ బీజేపీ అని తెలిపారు. బీజేపీ అంటేనే తెలవని రోజుల నుండి నేటి వరకు బీజేపీ బలమైన పార్టీగా ఎదుగుతుందన్నారు. త్రిపుర, హర్యానా, ఒడిశా రాష్ట్రాలతో సహా బీజేపీ విజయం సాధించింది అదే పంథాలో తెలంగాణ రాష్ట్రంలో కూడా బలపడుతుందన్నారు. దక్షిణా ది, ఉత్తరాది అంటూ దేశాన్ని విడగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.

దేశాన్ని ఎందరో విదేశీయులు వందల సంవత్సరాలు పరిపాలించిన ప్పటికీ హైందవ సంస్కృతిని, సనాతన ధర్మాన్ని మార్చలేక పోయారని, క్రిస్టియన్ దేశాలుగా, ముస్లిం దేశాలుగా మారిన కొన్ని దేశాలు భారత దేశాన్ని మార్చే కుట్రలు ఇటీవల జరుగుతున్నాయని విమర్శించారు. విదేశీ శక్తులు రాజకీయ అస్థిరత కోసం ఫండింగ్ కూడా పంపిస్తున్నారని తెలిపా రు. భారతీయులను విడగొట్టలేరనే సంకేతాన్ని సంఘ విద్రోహ శక్తులకు సంకేతాలు అందేలా ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలన్నారు.

సర్ కార్యక్ర మం గురించి కొన్ని పార్టీలు ప్రజల్లో తప్పుడు సంకేతాలు అందిస్తున్నారని విమర్శించారు. ఎంఐఎం పార్టీ రోహ్యింగాలకు హక్కుకు కల్పించే ప్రయత్నా లు చేస్తుందని ఈ విషయాన్ని సహించేదిలేదని తెలిపారు. ఇలాంటి వారు భారతదేశంలో శాంతి భద్రతలకు ప్రమాదమని విమర్శించారు.

దేశసేవ కోసం ముందుకు వచ్చే వారిని కార్యకర్తలు గుర్తించి జాతీయ భావాన్ని పెంపొందించి కొత్త వాళ్లను పార్టీలోకి తీసుకువచ్చే ఆలోచన చేయాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శాంత కుమార్, సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలత రెడ్డి, సీనియర్ జనసంఘ, ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.