ఇంద్రానగర్‌లో సిమెంట్ రోడ్డు నిర్మాణం పూర్తి
రూ.35 లక్షల వ్యయంతో చేపట్టిన పనులపై స్థానికుల హర్షం
ఉప్పల్ జూలై 28 (విజయక్రాంతి): ఉప్పల్ నియోజకవర్గం నాచారం డివిజన్ ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న ఇంద్రానగర్ సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులు ఎట్టకేలకు పూర్తయ్యాయి. సుమారు రూ.35 లక్షల వ్యయంతో ఇంద్రానగర్ మొదటి వీధి, ఇందిరా స్కూల్ పరిసర ప్రాంతాలతో పాటు కాలనీ ప్రారంభంలో సుమారు 150 మీటర్ల మేర సిమెంట్ రోడ్డు పనులు పూర్తి చేసినట్లు స్థానికులు తెలిపారు. నిర్మాణ పనులను బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు సాయిజెన్ శేఖర్ కాలనీవాసులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇంద్రానగర్ ప్రధాన రహదారిని కూడా త్వరలోనే చివరి వరకు అభివృద్ధి చేస్తామని తెలిపారు. రోడ్డు నిర్మాణంతో కాలనీలో రాకపోకల సమస్యలు తీరనున్నాయని, వర్షాకాలంలో ప్రజలకు కలిగే ఇబ్బందులు తగ్గనున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్, ఆశు భాయ్, ఉపేందర్, సజ్జు భాయ్, అశోక్, మునీర్ తదితరులు పాల్గొన్నారు. రోడ్డు నిర్మాణ పనులు పూర్తవడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తూ సంబంధిత అధికారులకు, ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.






