27 August, 2026 | 7:32 PM

కోతుల బెడద నివారించండి

27-08-2026 04:57 PM

సామాజిక కార్యకర్త ఏనుగు వెంకటరెడ్డి ఆధ్వర్యంలో వినతి పత్రం

మల్లాపూర్,(విజయక్రాంతి): మల్లాపూర్ మండల కేంద్రంలో కోతుల బెడదను నివారించాలని కోరుతూ సామాజిక కార్యకర్త ఏనుగు వెంకటరెడ్డి ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ పాలకవర్గానికి వినతి పత్రం సమర్పించారు. గురువారం నిర్వహించిన గ్రామసభలో మల్లాపూర్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్, కార్యదర్శి, ఉప సర్పంచ్ గడ్డం సోమరెడ్డి, పాలకవర్గ సభ్యులకు వినతి పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మల్లాపూర్‌లో కోతుల బెడద రోజురోజుకూ పెరుగుతోందని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇటీవల మూడవ వార్డులో ఓ నిండు గర్భిణీ కోతుల భయంతో భవనం పైనుంచి కిందపడటంతో గాయాలపాలైందని పేర్కొన్నారు. అంతేకాకుండా కోతులు ఇళ్లలోకి చొరబడి బియ్యం, పప్పులు తదితర నిత్యావసర వస్తువులను నాశనం చేస్తున్నాయని తెలిపారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని కోతుల బెడదను అరికట్టేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మల్లాపూర్ దేవాలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు క్యాతం సురేష్ రెడ్డి, ఉపాధ్యక్షులు గండికోట నర్సయ్య, నాయకులు పూండ్ర లక్ష్మారెడ్డి, మిట్టపల్లి జీవన్ రెడ్డి, ముద్దం శరత్ గౌడ్, డబ్బ రమేష్ రెడ్డి, బండి లింగస్వామి గౌడ్, పెద్దిరెడ్డి లక్ష్మణ్, వెల్మల రాజరెడ్డి, కొప్పెల శేఖర్, ఎలాల నడిపి రాజరెడ్డి, చిన్నోళ్ల చంద్రయ్య, వార్డు సభ్యులు ముష్కరి రమేష్, కదుర్క లక్ష్మి, అల్లె లత, ఏనుగు లక్ష్మితో పాటు పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.