27 August, 2026 | 8:43 PM

జనగామ మున్సిపాలిటీలో ఘనంగా వన మహోత్సవం

27-08-2026 04:58 PM

 జనగామ, ఆగస్టు 27 (విజయక్రాంతి): జనగామ మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డులో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మున్సిపాలిటీ పరిధిలో సుమారు 2 వేల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అధికారులు తెలిపారు. మొక్కలు నాటడమే కాకుండా వాటికి డ్రిప్ సదుపాయం కూడా కల్పిస్తున్నామన్నారు.

మొక్కలు నాటి వదిలేయకుండా 100 శాతం సంరక్షణ బాధ్యత తీసుకుంటున్నామని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. చెట్ల సమతుల్యం దెబ్బతినడం వల్ల వాతావరణంలో మార్పులు వచ్చి తీవ్ర ప్రభావం చూపుతుందని, అందుకే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్ రెడ్డి, చైర్ పర్సన్ బాలమణి, కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు