15 June, 2026 | 7:15 PM

Breaking News

వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి   •   సెలవులకు ముగింపు... ప్రభుత్వ పాఠశాలల్లో సందడి ప్రారంభం   •   అర్హులైన గిరిజన కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా సంక్షేమ పథకాలు   •   ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో రాష్ట్రంలోనే కామారెడ్డి జిల్లాను నంబర్ 1గా నిలపాలి   •   పాఠశాలలు, వసతి గృహాలు, ఆరోగ్య కేంద్రాల్లో పరిశుభ్రత, నాణ్యమైన సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలి   •   గిడ్డంగుల్లో ధాన్యం నిల్వతో అధిక లాభాలు   •   రేషన్ షాపుల ద్వారా ఉచితంగా 14 రకాల నిత్యవసర సరుకులు అందించాలి   •   ప్రైవేటు భూములను రిజిస్ట్రేషన్ నిషేధిత జాబితా(22-ఏ)నుండి విముక్తి కల్పించండి   •   కోర్ట్ కు సిమెంట్ బెంచీల వితరణ   •  

ప్రకృతి పర్యావరణాన్ని దెబ్బతీస్తున్న డంపింగ్ యార్డ్ ను వెంటనే తొలగించండి

15-06-2026 06:07 PM

ప్రపంచంలోనే ప్రమాదకర మైన ప్రాంతంగా.... జవహర్ నగర్ డంపింగ్ యార్డ్

పంచభూతాల సాక్షిగా... పర్యావరణం ఆందోళనకరం

ప్రజావాణిలో జిల్లా అదనపు కలెక్టర్ కు వినతిపత్రం సమర్పణ

జవహర్ నగర్,(విజయక్రాంతి): ప్రకృతి పర్యావరణాన్ని దెబ్బతీస్తున్న డంపింగ్ యార్డ్ ను  వెంటనే తొలగించాలని ప్రపంచంలోనే ప్రమాదకరమైన ప్రాంతంగా జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ నాలుగో స్థానంలో నిరుస్తుందని పంచభూతాల సాక్షిగా... పర్యావరణానికి ఆందోళన కలిగిస్తున్న జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ ను వెంటనే ఎత్తివేయాలని కోరుతూ ప్రజావాణిలో జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ పోరాట కమిటీ డిమాండ్ చేసింది.

మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా  కలెక్టరేట్లో సోమవారం కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ విజయేంద్ర రెడ్డికి డంపింగ్ యార్డ్ వ్యతిరేక పోరాట కమిటీ జేఏసీ చైర్మన్ షేక్షావలి అధ్యక్షతన జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ కో కన్వీనర్స్ కమిటీ సభ్యులు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా కో  కన్వీనర్స్ మాట్లాడుతూ జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలైన జవహర్ నగర్, కాప్రా, యాప్రాల్, కీసర, దమ్మాయిగూడ, నాగారం, రాంపల్లి, ఘట్కేసర్, అహ్మద్గూడా లాంటి తదితర ప్రాంతాల్లో ప్రకృతి పర్యావరణాన్ని మానవ మానవుల ఇతర జీవరాసుల వైవిధ్యాన్ని దెబ్బతీస్తున్న డంపింగ్ యార్డ్ పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఖండించారు.

ప్రజల ఆరోగ్య భద్రత మీద డంపింగ్ యార్డ్ తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని గాలి నీరు నేల పూర్తిగా కలుషితమైపోయాయని ప్రపంచంలోనే ప్రమాదకరమైన ప్రాంతంగా జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ నాలుగవ స్థానంలో ఉన్నదని తెలిపారు. పర్యావరణ శాస్త్రవేత్తలు సైంటిస్టులు ఈ డంపింగ్ యార్డ్ పట్ల తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని గుర్తు చేశారు. పాలకులకు భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి చట్టబద్ధమైన ప్రజాస్వామ్యమైన రాజ్యాంగబద్ధమైన పాలనను అందిస్తామని చెప్పి అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

గత ఎన్నికల సందర్భంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించి బాధిత డంపింగ్ యార్డ్ ప్రజలను ఓటు బ్యాంకు రాజకీయాలకే పరిమితం చేయడానికి వారు తీవ్రంగా తప్పుపట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న వెంటనే ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని సూచించారు. మంచినీరు నీరు ఆరోగ్య భద్రతలో భాగంగా జీవించే హక్కును పరిరక్షించాలని డిమాండ్ చేశారు. లేనియెడల భవిష్యత్తులో జరిగే ప్రజా పోరాటాలకు ఆందోళనకు ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాల్సి ఉంటుందని డంపింగ్ యార్డ్ ఎత్తివేత పోరాట కమిటీ ఈ సందర్భంగా హెచ్చరించింది.