15 June, 2026 | 7:15 PM

Breaking News

వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి   •   సెలవులకు ముగింపు... ప్రభుత్వ పాఠశాలల్లో సందడి ప్రారంభం   •   అర్హులైన గిరిజన కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా సంక్షేమ పథకాలు   •   ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో రాష్ట్రంలోనే కామారెడ్డి జిల్లాను నంబర్ 1గా నిలపాలి   •   పాఠశాలలు, వసతి గృహాలు, ఆరోగ్య కేంద్రాల్లో పరిశుభ్రత, నాణ్యమైన సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలి   •   గిడ్డంగుల్లో ధాన్యం నిల్వతో అధిక లాభాలు   •   రేషన్ షాపుల ద్వారా ఉచితంగా 14 రకాల నిత్యవసర సరుకులు అందించాలి   •   ప్రైవేటు భూములను రిజిస్ట్రేషన్ నిషేధిత జాబితా(22-ఏ)నుండి విముక్తి కల్పించండి   •   కోర్ట్ కు సిమెంట్ బెంచీల వితరణ   •  

ప్రోగ్రాం, ఫార్మసీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి

15-06-2026 06:04 PM

కొత్తగూడెం,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా  జిల్లా కార్యాలయం నందు ప్రోగ్రామ్ ఆఫీసర్లతో పునఃశ్చరణ కార్యక్రమమును నిర్వహించడం జరిగినది .ఈ కార్యక్రమంలో ముఖ్యంగా పల్స్ పోలియో ఈనెల 28న ఉన్నందున దానికి సంబంధించిన సమావేశాలు శిక్షణ కార్యక్రమాలు, అదేవిధంగా మొదటి రోజు బూత్ ఆక్టివిటీ రెండవ రోజు మరియు మూడవ రోజుగృహ సందర్శనలు చేయడం గురించి చర్చించడం జరిగినది. ఈ నెల 19న వరల్డ్ సికిల్ సెల్ ఎనీమియా దినోత్సవం సందర్భంగా జిల్లాలో సికిల్ సెల్ ఎనీమియా, తలసీమియా, రక్త కణ లోపాలు ఉన్న వారిని గుర్తించి స్క్రీనింగ్ చేయుట, క్యాంపులు నిర్వహించడం గురించి మాట్లాడడం జరిగినది.

అదేవిధంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సిబ్బంది కొరత ఉన్నందున వాటిని అధిగమించడానికి ఒక పటిష్ట ప్రణాళికను తయారు చేయుట గురించి వివరించడం జరిగినది..డిప్యూటీ డీఎంహెచ్ఓ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. తుకారాం రాథోడ్ జిల్లా ఫార్మసీ అధికారులతో, సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డా. తుకారాం రాథోడ్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మందుల నిర్వహణ, నిల్వ, పంపిణీ వ్యవస్థను మరింత పటిష్టంగా నిర్వహించాలని సూచించారు. గడువు ముగిసిన మందులు, వినియోగానికి అనర్హమైన మందుల రికార్డులు, డిస్కార్డ్ చేసిన మందుల రిజిస్టర్లను సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు.

వ్యాక్సిన్లు మరియు ఫార్మసీ మందుల కోసం ప్రత్యేక స్టాక్ రిజిస్టర్లు నిర్వహించాలని, వేగంగా వినియోగమయ్యే, మరియు తక్కువగా వినియోగమయ్యే,మందులపై ఎప్పటికప్పుడు విశ్లేషణ చేపట్టి అవసరమైన మేరకు నిల్వలను నిర్వహించాలని సూచించారు. రోగనిరోధక టీకాల కార్యక్రమంలో ఉపయోగించే వ్యాక్సిన్లను నిర్దేశిత ఉష్ణోగ్రత వద్ద భద్రపరచడంతో పాటు కోల్డ్ చైన్ నిర్వహణను కచ్చితంగా పాటించాలని తెలిపారు. వ్యాక్సిన్ల నాణ్యతను కాపాడేందుకు కోల్డ్ చైన్ నిర్వహణలో ఎటువంటి నిర్లక్ష్యం ఉండకూడదని హెచ్చరించారు.

అలాగే మందుల కొనుగోలు, స్వీకరణ, పంపిణీ, నిల్వలకు సంబంధించిన అన్ని లావాదేవీలను ఈ-ఔషధి పోర్టల్ లో సకాలంలో నమోదు చేసి ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని ఆదేశించారు. జిల్లాలోని అన్ని ఆరోగ్య సంస్థల్లో అవసరమైన మందులు, వ్యాక్సిన్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, రోగులకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించడంలో ఫార్మసీ అధికారుల పాత్ర కీలకమని పేర్కొన్నారు.