15 June, 2026 | 7:16 PM

Breaking News

వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి   •   సెలవులకు ముగింపు... ప్రభుత్వ పాఠశాలల్లో సందడి ప్రారంభం   •   అర్హులైన గిరిజన కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా సంక్షేమ పథకాలు   •   ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో రాష్ట్రంలోనే కామారెడ్డి జిల్లాను నంబర్ 1గా నిలపాలి   •   పాఠశాలలు, వసతి గృహాలు, ఆరోగ్య కేంద్రాల్లో పరిశుభ్రత, నాణ్యమైన సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలి   •   గిడ్డంగుల్లో ధాన్యం నిల్వతో అధిక లాభాలు   •   రేషన్ షాపుల ద్వారా ఉచితంగా 14 రకాల నిత్యవసర సరుకులు అందించాలి   •   ప్రైవేటు భూములను రిజిస్ట్రేషన్ నిషేధిత జాబితా(22-ఏ)నుండి విముక్తి కల్పించండి   •   కోర్ట్ కు సిమెంట్ బెంచీల వితరణ   •  

పల్లెల నుంచే కాంగ్రెస్ పార్టీ భలోపేతం: గ్రామ కమిటీల ఏర్పాటు వేగవంతం

15-06-2026 06:10 PM

మండల అధ్యక్షుడు మానుక సత్యం

కోనరావుపేట,(విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీని పల్లెల స్థాయి నుంచి మరింత బలోపేతం చేసేందుకు గ్రామ కమిటీల ఏర్పాటును చేపడుతున్నట్లు కోనరావుపేట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మానుక సత్యం తెలిపారు. సోమవారం మండలంలోని శివంగళపల్లి గ్రామంలో గ్రామ శాఖ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ సందర్భంగా ఆయన మాట్లాడారు. పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసే ఉత్సాహవంతులైన ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని సూచించారు. పార్టీ అధిష్ఠానం నిర్ణయించే గ్రామ శాఖ అధ్యక్షుని నాయకత్వంలో అందరూ సమన్వయంతో పనిచేసి పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.