24 August, 2026 | 7:46 PM

సుల్తానాబాద్‌లో 5,075 ఓట్ల తొలగింపు

24-08-2026 06:13 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో (ఎస్ఐఆర్)  ఓటర్ల జాబితాలో భాగంగా మొత్తం 5,075 ఓట్ల తొలగింపును అధికారులు గుర్తించారు, సుల్తానాబాద్ పట్టణ, మండలంలోని గ్రామాలలో మృతి చెందిన వారు, ఇతర ప్రాంతాలకు తరలి వెళ్ళిన వారి ఓట్లను జాబితా నుండి తొలగించేందుకు ప్రతిపాదించారు. ఈ జాబితా పై ఏమైనా అభ్యర్థనలు ఉంటే సెప్టెంబర్ 16 లోపు దరఖాస్తు చేసుకోవాలని తాసిల్దార్ బషి రుద్దీన్ తెలిపారు.