24 August, 2026 | 8:10 PM

కరీంనగర్‌లో ఉచితంగా శస్త్ర చికిత్సలు

24-08-2026 06:29 PM

మానకొండూరు,(విజయక్రాంతి): అంకిత్ హాస్పిటల్ హైదారాబాద్ వారి ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ వారి సహకారం తో మండల కేంద్రమైన మానకొండూరులో ఆదివారం జరిగిన ఉచిత నేత్ర వైద్య శిబిరంలో కంటి పరీక్షలు నిర్వహించగా, మానకొండూరు మండలానికి చెందిన 70 మందికి రేపు కరీంనగర్ లో శస్త్ర చికిత్స నిర్వహిస్తారని మానకొండూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ద్వావ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఉదయం 10:30 గంటలకు వైద్యులు శస్త్ర చికిత్సలకు సిఫారసు చేసిన వారు మానకొండూరు ప్రభుత్వ పాఠశాల (బాలురు) పల్లె మీద కు సకాలంలో రావాల్సింది గా ఆయన కోరారు.

హై స్కూల్ ప్రాంగణం నుండి వారికి ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేశామని,రూపాయలు 250,అన్నం ప్లేటు,దుప్పటి వెంటతెచ్చుకోవాలని ఒక రోజులో చికిత్స ఉంటుందని, వారి తోడుగా వచ్చే వారు సొంతగా రావాలని, ఆధార్ కార్డు, రేషన్ కార్డు తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలని ఆయన సూచించారు. 

నేడు (మంగళవారం) సబ్ స్టేషన్ ప్రారంభోత్సవం 

మండల పరిధిలోని దేవంపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన సబ్ స్టేషన్ ను మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ప్రారంభిస్తారని , పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ద్యావ శ్రీనివాసరెడ్డి కోరారు.