నీరుకుల్లాలో స్మార్ట్ కార్డుల పంపిణీ ప్రారంభం
24-08-2026 06:40 PM
సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నీరుకుళ్ల గ్రామంలో స్మార్ట్ కార్డు (రేషన్ కార్డు)ల పంపిణీ కార్యక్రమం సోమవారం సర్పంచ్ కాంపెల్లి సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ ప్రజలకు స్మార్ట్ కార్డుల పంపిణీ చేశారు, ఈ కార్యక్రమంలో జిపిఓ శ్రీనివాస్, కార్యదర్శి సునీత, సాగర్, వివో ఏ దీపిక తదితరులు పాల్గొన్నారు.






