24 August, 2026 | 8:10 PM

సమస్యల పరిష్కారానికే ప్రజావాణి

24-08-2026 06:26 PM

కౌటాల,(విజయక్రాంతి): అధికారుల దృష్టికి సమస్యలను తీసుకెళ్లేందుకు మండల కేంద్రంలో నిర్వహిస్తున్న ప్రజావాణికి ప్రజల నుంచి స్పందన లభిస్తోంది. ప్రతి వారం నిర్వహిస్తున్న కార్యక్రమంలో వివిధ గ్రామాల ప్రజలు తమ సమస్యలపై వినతిపత్రాలు సమర్పిస్తున్నారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో పలువురు తమ సమస్యలను అధికారులకు వివరించి, పరిష్కరించాలని కోరారు. వ్యక్తిగత సమస్యలతో పాటు గ్రామాల్లో నెలకొన్న సమస్యలను కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

వినతిపత్రాలను స్వీకరించిన అధికారులు సంబంధిత శాఖల ద్వారా సమస్యలను పరిశీలించి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకుండా తమ సమస్యలను ఒకే వేదికపై అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రజావాణి ఉపయోగపడుతోంది. ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహిస్తుండటంతో తమ సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్న ఆశతో ప్రజలు వినతులు అందజేస్తున్నారు.