సొంత నిధులతో చెట్లకొమ్మల తొలగింపు
29-07-2026 12:47 AM
మాజీ కార్పొరేటర్ ముద్దం నర్సింహ యాదవ్
సికింద్రాబాద్, జులై28 (విజయక్రాంతి): ఓల్ బోయిన్ పల్లి డివిజన్ ఆర్‌ఆర్ నగర్ రోడ్ నెం.10లో ప్రజల ఇబ్బందులను గుర్తించిన ఓల్ బోయిన్ పల్లి మాజీ కార్పొరేటర్ ముద్దం నర్సింహ యాదవ్ తన స్వంత నిధులతో ట్రాక్టర్ను ఏర్పాటు చేసి, రోడ్డుపై ప్రమాదకరంగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించే పనులు చేపట్టించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల భద్రత మరియు కాలనీ పరిశుభ్రత తనకు అత్యంత ప్రాధాన్యమని ఇస్తామని తెలియజేస్తూరోడ్డుపై పడిన చెట్ల కొమ్మలు వాహనదారులు, పాదచారులకు ఇబ్బందులు కలిగించకుండా వెంటనే తొలగించేలా చర్యలు తీసుకున్నామని ముద్దం నర్సింహ యాదవ్ తెలియజేశారు.






