4 July, 2026 | 11:21 PM

Breaking News

అనురాగ్ వార్షిక స్నాతకోత్సవంలో 2,789 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం   •   హ్యూమన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సాయి భాను   •   డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన   •   వేములవాడ నాయీ బ్రాహ్మణ అసోసియేషన్‌ నూతన కమిటీ   •   పేరం వెంకటేశ్వర రావుకి ఘన సన్మానం   •   నీటి సంపులో పడి చిన్నారి మృతి   •   సీఐ కరుణాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు   •   కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు   •   దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •  

రోడ్డు మధ్యలో ఉన్న విద్యుత్ స్తంభాల తొలగింపు

11-04-2026 08:52 PM

ట్రాన్స్కో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సాలియా నాయక్

కామారెడ్డి,(విజయక్రాంతి): రోడ్డు మధ్యలో ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించే పనిని శనివారం విద్యుత్ అధికారులు, ఇబ్బంది కలిసి విజయవంతంగా పూర్తి చేసినట్లు కామారెడ్డి సూపరింటెండింగ్ ఇంజనీర్ ఈ సాలియా నాయక్ తెలిపారు. ప్రజలకు రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా ఉండేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు ఆయన వివరించారు. ఈ పనులను సమర్థవంతంగా పూర్తి చేసిన డివిజనల్ ఇంజనీర్  కళ్యాణ చక్రవర్తి, అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్  అశోక్, ఏఈలు సిబ్బందిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ చర్యలతో భద్రతా ప్రమాణాలు మెరుగుపడినట్లు స్థానిక ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.