4 July, 2026 | 9:59 PM

Breaking News

అనురాగ్ వార్షిక స్నాతకోత్సవంలో 2,789 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం   •   హ్యూమన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సాయి భాను   •   డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన   •   వేములవాడ నాయీ బ్రాహ్మణ అసోసియేషన్‌ నూతన కమిటీ   •   పేరం వెంకటేశ్వర రావుకి ఘన సన్మానం   •   నీటి సంపులో పడి చిన్నారి మృతి   •   సీఐ కరుణాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు   •   కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు   •   దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •  

దినజనుల జీవితాల్లో వెలుగు రేఖ నింపిన మహానుభావుడు మహాత్మా జ్యోతి బా పూలే

11-04-2026 08:55 PM

మున్సిపల్ చైర్ పర్సన్ ప్రవీణ్ కుమార్

మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా జయంతి కార్యక్రమాలు

శంకర్ పల్లి,(విజయక్రాంతి): సామాజిక అసమానతలు తొలగించిన క్రాంతి రేఖ, దీనజనుల జీవితాల్లో వెలుగు రేఖ నింపిన మహనీయుడు మహాత్మ జ్యోతి బా పూలే అని శంకర్ పల్లి మున్సిపల్ చైర్ పర్సన్  సాతా ప్రవీణ్ కుమార్ అన్నారు. శనివారం శంకర్ పల్లి మున్సిపల్ కార్యాలయంలో మహాత్మ జ్యోతిబా జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలు, మహిళ అభివృద్ధికై అలుపెరుగని పోరాటం చేసిన మహా యోధుడని కొనియాడారు.

సమ సమాజ స్థాపనలో భావితరాలకు స్ఫూర్తి ప్రదాతగా నిలిచి దళితుల అభ్యున్నతికి పాటుపడిన మహోన్నత వ్యక్తి జ్యోతిబాపూలే అన్నారు. అసమాన తలను రూపుమాపడానికి కృషి చేసిన మహోన్నత వ్యక్తి పు లే అని అన్నారు. ఈ కార్యక్రమంలో శంకర్ పల్లి ఏఎంసీ మాజీ చైర్మన్ ప్రకాష్, నాయకులు పార్శి బాలకృష్ణ, జూలకంటి పాండురంగారెడ్డి, మున్సిపల్ మేనేజర్  అంజన్ కుమార్, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్ చంద్రమౌళి, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.