calender_icon.png 18 February, 2026 | 4:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పంచాయతీలకు 250 కోట్లు విడుదల

18-02-2026 01:16:33 AM

రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

హైదరాబాద్, ఫిబ్రవరి 17 (విజయక్రాంతి): రాష్ట్రంలోని పంచాయతీల అభి వృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పంచాయతీల నిర్వహణ కోసం రూ. 250 కోట్లు నిధులను విడుదల చేస్తూ మంగళవారం ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తిచేయడానికి ఈ నిధులు దోహదపడతాయి. కేంద్ర ప్రభు త్వం ఇటీవల 15వ ఆర్థిక సంఘం నిధు ల్లో భాగంగా రెండో విడత కింద రూ. 387 కోట్లను విడుదల చేసింది.

రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు విడుదల చేసిన నిధు లు వీటికి అదనం. గ్రామాల్లో అంతర్గత రహదారుల మరమ్మతులు, మురుగు కాలువల నిర్మాణం చేపట్టడానికి పంచాయతీలకు వెసులుబాటు కలుగుతుంది. 15వ ఆర్థిక సంఘం నిధుల కింద రాష్ట్రానికి రావాల్సిన సుమారు 3,000 కోట్ల కోసం ప్రభుత్వం ఎదురుచూస్తోంది. ఈ నిధులు విడతల వారీగా అందుతాయని అధికారులు భావిస్తున్నారు.