4 May, 2026 | 3:12 PM

Breaking News

కేరళం హస్తగతం.. యూడీఎఫ్ ఆధిక్యం   •   మాది రైతు ప్రభుత్వం భరోసా లేని రైతు జీవితానికి భరోసా కల్పిస్తాం: విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్   •   ఇంకా ఓడిపోయినట్లు కాదు.. ఎన్నికల ఫలితాలపై మమతా బెనర్జీ స్పందన   •   ప్లాస్టిక్ గ్లాస్లో చాయ్ తాగితే 3,000 జరిమానా   •   కాంగ్రెస్ పార్టీ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మారం రెడ్డి కౌటిల్ రెడ్డి   •   రైతు వేదికల్లో రైతులకు అవగాహన సదస్సులు   •   కాంగ్రెస్ పార్టీలో మైనారిటీలకు ప్రాధాన్యత లేదు: ఎండీ ఖాజా భక్ష్   •   అగ్ని ప్రమాదంలో 44 లక్షల పంట నష్టం 47 ఎకరాల్లో దగ్ధం   •   అకాల వర్షాలతో కొమరారం కేంద్రంలో తడిసిన మొక్కజొన్న   •   మొక్కజొన్నకు అగ్ని ప్రమాదాలు   •  

జిల్లాలో ఓటరు మ్యాప్ వేగవంతం

18-02-2026 01:15 AM

నిర్మల్, ఫిబ్రవరి ౧౭ (విజయక్రాంతి): ఓటరు ప్రోజెని మ్యాపింగ్ ప్రక్రియలో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లతో ఎస్‌ఐఆర్ ప్రక్రియకు సంబంధించి ఓటరు మ్యాపింగ్ నిర్వహణపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. కలెక్టరేట్లోని వీసీ హాలులో నుంచి జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పాల్గొన్నారు.

సమావేశం అనంతరం కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ, ఓటరు ప్రోజెని మ్యాపింగ్లో మరింత వేగవంతం చేయాలని సూచించారు. 2002 వివరాలతో ప్రస్తుత వివరాలను సరిపోల్చి మ్యాపింగ్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. నిర్ణీత గడువులోగా ప్రోజెని మ్యాపింగ్ పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, ఆర్డీఓ రత్నకళ్యాణి, తహసిల్దార్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.