సూరన్న సురుకులు..
రికార్డ్ స్థాయిలో ఉమ్మడి జిల్లాలో ఎండలు
మార్చి తొలివారంలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా 40 డిగ్రీలు నమోదు
ఉదయం 10 గంటల నుంచే ఉక్క పోత లు
సింగరేణి కార్మికులకు, విద్యార్థులకు తప్పని తిప్పలు
ఇళ్ల నుంచి బయటకు రావాలంటే జంకుతున్న జనం
ఏప్రిల్ , మే నెలలో పరిస్థితిపై ఆందోళన
మణుగూరు/సత్తుపల్లి,మార్చి 9 (విజయక్రాంతి): ఉమ్మడి ఖమ్మం జిల్లాపై భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మార్చి మెుదటి వారంలోనే జిల్లాపై నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. ఉదయం 10 గంటలకే భానుడు భగభగలతో ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే ప్రజలు జంకాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. సాధారణంగా ఏప్రిల్, మేలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయి కానీ, అందుకు భిన్నంగా గత నాలుగు రోజుల నుండి ఉష్ణోగ్రతలు ఒక్క సారిగా పెరిగిపోయాయి.
జిల్లాలో పలు ప్రాంతాలలో సోమవారం పగటి ఉష్ణోగ్రత లు 40 డిగ్రీలకు చేరిపోయాయి. మార్చి లోనే ఉష్ణో గ్రతలు ఇలా ఉంటే ఏప్రిల్, మేలో ఉష్ణోగ్రతలు ఏ స్థాయికి చేరుకుం టాయనే భయాందోళనలు వ్యక్తమవుతు న్నాయి. మరోవైపు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో వాతావరణశాఖ జిల్లాకు ఆరేంజ్ అలర్ట్ ప్రకటించింది. రికార్డ్ స్థాయిలో ఉమ్మడి జిల్లాలో నమోదు అవుతున్న ఎండలఫై విజయక్రాంతి కథనం..
జిల్లాపై భానుడి ప్రతాపం, దంచి కొడుతున్న ఎండలు..
జిల్లాల్లో భానుడు నిప్పులు కురిపించాడు. భద్రాద్రి కొత్తగూడెం,ఖమ్మంలో 40 డిగ్రీల సెల్సియస్ నమోదు కావడంతో ప్రజలు హడలెత్తిపోయారు. అయితే భద్రాచలంలో సాధారణంగా 36.3 డిగ్రీలు నమోదు కావాల్సి ఉండగా, ఏకం గా 37 డిగ్రీలు పెరగడంతో ఎండల తీవ్రత ఏ మేర ఉందో అర్థం చేసుకోవచ్చు.ఇక ఖమ్మం జిల్లాల్లో దాదాపు 39 డిగ్రీల ఎండ కాసినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
మరోవైపు రానున్న నాలుగు రోజులలో ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో సాధారణం కన్నా రెండుమూడు డిగ్రీలు అధికంగా ఎండలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ మేరకు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. జిల్లా కేంద్రం కొత్తగూడెంతో పాటు, సింగరేణి ప్రభావిత పారిశ్రామిక ప్రాంతాలైన మణుగూరు, ఇల్లందు, పాల్వంచ, టేకులపల్లి, భద్రాచలం పట్టణాలలో రోజురోజు కు వేడెక్కిపోతున్న వాతావరణంతో ఎండలు మండిపోతున్నాయి. పగటి పూట ఇప్పటికే కర్ఫ్యూ వాతావరణం ఏర్పడింది. మధ్యాహ్నం 12 గంటలు దాటిన తర్వాత రోడ్ల పైన తిరిగేందుకు జనం జంకుతున్నారు.
జంకుతున్న జనం..
వేసవి కాలం ముదరకముందే భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. మార్చి ఆరం భంలోనే ఇలా ఉంటే.. ఇక మున్ముందు ఎండల తీవ్రత ఎలా ఉంటుందోనని ప్రజలు హడలెత్తిపోతున్నారు. ఉదయం 10 దాటిందంటే చాలు కాలు బయటపె ట్టాలంటే భయపడాల్సిన పరిస్థితి నెల కొంది. భానుడి భగభగలకి వీధులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. తీవ్రమైన ఎండలు, ఉక్కపోతతో అలమటిస్తున్నారు.
కూలర్లు, ఏసీలు లేనిది నిద్ర పట్టడం కష్టమే అన్నట్లుగా పరిస్థితి ఏర్పడింది. కూరగాయలు, ఇతర చిరు వ్యాపారులు ఎండవేడిమి భరించలేకపోతున్నారు. రోడ్లపక్కన గొడుగులు ఏర్పాటు చేస్తూ తాత్కాలిక ఉపశమనం పొందుతున్నారు. స్వయం సహాయక సంఘాల సహకారంతో చలి వేంద్రాలు, మజ్జిగ కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
కార్మికులకు, విద్యార్థులకు తప్పని ఇబ్బందులు..
జిల్లాలోని కొత్తగూడెం, కోయగూడెం, ఇల్లందు, మణుగూరు సింగరేణి ఏరియా లలోని ఓపెన్కాస్టు, అండర్ గ్రౌండ్ మైన్ల లో విధులు నిర్వహించే కార్మికులు పెరిగి న ఎండల కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా మిడిల్ షిఫ్ట్, ఉదయం షిఫ్ట్లో్ల విధులు నిర్వహించే కార్మికులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఉదయం షిఫ్ట్ వెళ్లే కార్మికులు 2గంటలకు విధులు ముగించుకొని ఇంటికి రావాల్సి ఉండగా, మిడిల్ షిఫ్ట్ వెళ్లేవారు మధ్యాహ్నం ఒంటి గంటకు బయలు దేరాల్సి ఉంటుంది.
ఈ క్రమంలో విధులకు హాజరయ్యే వారు, విధుల నుంచి తిరిగి వచ్చే వారు ఎండ తీవ్రతకు గురవుతున్నారు. ఇప్పటికిప్పుడు గనుల్లో హాజరుశాతం తగ్గకపోయినా రాబోయే రోజుల్లో ఎండలు తీవ్రతరం కానుండగా, హాజరుశాతంపై ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎండల వేడిమి కారణంగా విధులు నిర్వహించేందుకు కార్మికులు ఆసక్తి చూపే అవకాశాలు తక్కువగా ఉండను న్నాయి. కార్మికుల అవస్థలు దృష్టిలో పెట్టుకొని సింగరేణి ఉన్నతాధికారులు షిఫ్ట్ల వేళల్లో మార్పులు చేపట్టాలని కార్మికులు కోరుతున్నారు. మరోవైపు కళాశాలలు, పాఠశాలలకు వెళ్లే విద్యా ర్థులు సైతం ఎండల కారణంగా ఇబ్బందు లు పడుతున్నారు. అలాగే పాఠశాలలకు ఒంటి పూట ప్రకటించినప్పటికీ మధ్యా హ్నం సమయంలో ఎండ వేడికి గురవు తున్నారు.
జాగ్రత్తలు తప్పనిసరి, వైద్య ఆరోగ్యశాఖ
ఎండల తీవ్రత నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సూచించింది. వేసవిలో డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండటానికి తరచుగా మంచి నీళ్లు కొబ్బరి నీళ్లు, మజ్జిగ వంటి పానీయాలు తీసుకోవాలని చెబుతున్నా రు. మధ్యాహ్నం 11 గంటల నుంచి 4 గంటల వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదని సూచిస్తు న్నారు. నూనెలో వేయించిన పదార్థాలు, మసాలాలు తగ్గించాలని.. తేలికపాటి ఆహారం తీసుకోవాలని సూచనలు చేస్తు న్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు వేసవిలో తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించా లని స్పష్టం చేశారు.




