పార్ట్‌టైం ఇన్‌స్ట్రక్టర్లు, హెల్పర్ల పునర్నియామకం
09-06-2026 01:53 AM
ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ
హైదరాబాద్, జూన్ 8 (విజయక్రాంతి): ఈ నూతన విద్యా సంవత్సరానికి సంబంధించి పార్ట్‌టైం ఇన్‌స్ట్రక్టర్లు, హెల్పరు ్ల/ఆయాలను పునర్నియమించేందుకు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ 23న నాటికి వీరి సేవలు ముగియడంతో మళ్లీ ఈ నూతన విద్యాసంవత్సరానికి నియమించుకునేలా ఉత్తర్వులు జారీ చేశారు.
ఈనెల 8 నుంచి నియామకాలు అమలులో ఉంటాయని, ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో అవసరాన్ని బట్టి వారిని కొనసాగించాలన్నారు. ప్రస్తుత నెలవారీ వేతనంలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన వీరి సేవలను వినియోగించుకోనున్నారు. ఇందుకు జిల్లా అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.






