ఆటోను ఢీకొన్న లారీ: ఒకరు మృతి
మధిర,(విజయ క్రాంతి): మధిర పట్టణంలోని దెందుకూరు ఫ్లేవర్ వద్ద ఆటోను ఢీకొట్టిన టిప్పర్ లారీ. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.... ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు జమలాపురం దైవదర్శనానికి వెళ్లి వస్తుండగా నిదానపురం- దెందుకూరు సమీపంలో ఎదురుగా వస్తున్న లారీ అదుపుతప్పి ఆటోను ఢీకొనడంతో ఐదుగురు ప్రమాదానికి గురయ్యారు.
ఐదుగురిలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా ఇద్దరు పరిస్థితి విషమయం. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఇద్దరిని మధిర నుండి ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ వారి లో మూడు సంవత్సరాల పాప, తాళ్లూరి చంద్ర (45 ), తాళ్లూరి భవాని (40) మృతి చెందిందని తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.






