29 July, 2026 | 2:12 AM

పులుల సంరక్షణలో ఏటీఆర్‌కు 23 అవార్డులు

29-07-2026 12:07 AM

జాతీయ, రాష్ట్ర స్థాయిలో అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ సిబ్బందికి అరుదైన గౌరవం

అచ్చంపేట, జూలై 28: పులుల సంరక్షణ, అటవీ రక్షణ, వన్యప్రాణుల పరిరక్షణలో విశేష సేవలందించిన అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ (ఏటీఆర్) సిబ్బందికి జాతీయ, రాష్ట్ర స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచ పులుల దినోత్సవం సందర్భంగా మొత్తం 23 మంది అధికారులు, సిబ్బంది ప్రతిభా పురస్కారాలకు ఎంపికయ్యారు. న్యూఢిల్లీలో జూలై 29న ఎన్టీసీఏ ఆధ్వర్యంలో జరిగే ఈ వేడుకల్లో ప్రదానం చేసే ’ఎక్సలెన్స్ ఇన్ పెర్ఫార్మెన్స్’ జాతీయ అవార్డులకు ఏటీఆర్కు చెందిన బీట్ అధికారులు ఎం. మమత, పర్వీన్ బేగం, కె. తేజశ్రీ ఎంపికయ్యారు.

హైదరాబాద్ దూలపల్లిలో నిర్వహించే రాష్ట్రస్థాయి ప్రపంచ పులుల దినోత్సవ వేడుకల్లో ప్రదానం చేసే అవారడ్స్ ఆఫ్ ఎక్సలెన్స్’ కు ఏటీఆర్ పరిధిలోని మరో 20 మంది అధికారులు, సిబ్బంది ఎంపికయ్యారు. వీరిలో ఫారెస్ట్ రేంజ్, సెక్షన్, బీట్ అధికారులు, జీవ శాస్త్రవేత్తలు, యనిమల్ ట్రాకర్లు, బేస్ క్యాంప్ వాచర్లు, సఫారీ డ్రైవర్లు, రెస్క్యూయర్లు ఉన్నారు. ఫ్రంట్లైన్ సిబ్బంది అంకితభావంతో పనిచేస్తున్నందుకే ఈ గుర్తింపు లభించిందని జిల్లా అటవీ అధికారి రేవంత్ చంద్ర, ఐఎఫ్‌ఎస్ తెలిపారు. జాతీయ, రాష్ట్ర స్థాయిలో 23 మంది ఎంపిక కావడం అమ్రాబాద్ టైగర్ రిజర్వ్తో పాటు తెలంగాణ అటవీ శాఖకు గర్వకారణమని పేర్కొన్నారు.