20 March, 2026 | 3:30 AM

కంటోన్మెంట్ బోర్డ్ పరిధిలో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు

20-03-2026 12:00 AM

అక్రమ నిర్మాణాలపై సీఈవో తక్షణమే చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు వినతి

  1. విలేకరులు, స్థానిక ప్రజలు ఫిర్యాదులు చేసినా కూడా పట్టించుకొని బోర్డ్ ఇంజినీరింగ్ అధికారులు
  2. బోర్డు టౌన్ ప్లానింగ్ అధికారుల వ్యవహార శైలి పై అనేక అనుమానాలు

సికింద్రాబాద్, మార్చి 1౯ (విజయక్రాంతి): కంటోన్మెంట్ బోర్డు యాక్ట్ కాగి తాలకే పరిమితం అన్నట్లుగా కంటోన్మెంట్ బోర్డ్  అధికారుల పనితీరు అద్దం పడుతోందని, స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. సామా న్యుల పాలిట ఉక్కుపాదంతో కూల్చివేతలు చేపట్టే అధికారులు, పేరు పలుకుబడి రాజకీయ అండదండలు ఉన్న వారి పట్ల భిన్నంగా సహకరించడం చర్చనీయాంశంగా మారింది.

కంటోన్మెంట్ బోర్డ్ ఒకటో, నాలుగు, ఆరోవ వార్డ్ పరిధిలోని వాసవి కాలనీ, డైమండ్ పాయింట్, సీతారాంపురం,బాపూజీ నగర్, భావన కాలనీ లో కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలకు టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ అధికారుల ద్వంద్వ వైఖరికి నిదర్శనమని స్థానికంగా పలు విమర్శలు వెలువడుతున్నాయి. 

జోరుగా అక్రమంగా సెల్లారు,పెంట్ హౌస్ నిర్మాణం..

కంటోన్మెంట్ యాక్ట్ ను తుంగలో తొక్కి అనుమతులకు విరుద్ధంగా బోర్డు పరిధిలో  లో జోరుగా అక్రమ నిర్మాణాలు యదేచ్ఛగా కొనసాగుతోంది. కనీసం నియమాలు పాటించకుండా సెట్ బ్యాక్, ఫైర్ సేఫ్టీ లేకుం డా నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం కొనసాగుతుంటే కనీసం స్పందించకుండా టౌన్ ప్లానింగ్, బోర్డు అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై స్థానికులు మండిపడుతున్నారు.

ప్రమాదాలకు నిలయంగా నిర్మిస్తున్న అక్ర మ నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని స్థానికులు పలు మార్లు ఫిర్యాదులు చేసినా కూడా మాకు సంబంధమే లేదన్నట్లుగా కంటోన్మెంట్ బోర్డ్ టౌన్ ప్లానింగ్ యంత్రాం గం వ్యవహరిస్తున్న  తీరుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అవినీతికి దాసోహం అంటూ అధికారులు పరోక్షంగా అక్రమ నిర్మాణదారులకు అండగా నిలుస్తున్నారనే అపవాదులు వెలువడుతున్నాయి. కాసుల కక్కుర్తిలో పడి అక్రమ నిర్మాణాలను నివారించాల్సిన అధికారులే  బోర్డు యాక్ట్  ను కాగితాలకే పరిమితం చేస్తున్నారని విమర్శలు బహిరంగంగా వెలువడుతున్నాయి. సామాన్యులకు ఓ న్యాయం.. అక్రమార్కులకు మరో న్యాయమా అని స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు. 

నోటీసులు ఇస్తారు.. చర్యలు శూన్యం..

కంటోన్మెంట్ బోర్డ్ పరిధిలో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని బోర్డు సీఈవో కి ఫిర్యాదు చేసినప్పటికి అధికారులు నోటీసుల పేరుతో కాలయాపన చేస్తున్నారు. కంటోన్మెంట్ పరిధిలోని పలు ప్రాంతాల్లో జోరుగా అక్రమ నిర్మాణాలు నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్నా ఇంజనీరింగ్ అధికారులు పట్టించు కోకపోవడం పట్ల స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 

పలుమార్లు ఫిర్యాదు చేసినా డోంట్ కేర్ అన్న ట్టు అధికారుల వ్యవహారాల శైలీ ఉంటుందని ఆరోపణలు  బలం గా వినిపిస్తున్నాయి. అక్రమార్కులకు టౌన్ ప్లానింగ్ అధికారులు వత్తా సు పలుకుతున్నారని, అందుకే అక్రమ నిర్మాణాలు దర్జాగా సాగిస్తున్నారని ఇది అధికారు లకు సిగ్గు చేటు అంటూ స్థానికులు విమర్శలు చేస్తున్నారు. కంటోన్మెంట్ సీఈవో స్పందించి బోర్డు  పరిధిలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు..