20 March, 2026 | 5:15 AM

చారకొండలో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహానికి భూమిపూజ

20-03-2026 12:00 AM

చారకొండ మార్చి 19 : గౌడ జాతి గౌరవ ప్రతీకలైన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్, బొమ్మగాని ధర్మబిక్షం గౌడ్ విగ్రహాల ఏర్పాటుకు భూమిపూజ కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రం లో గ్రామ గౌడ సంఘం ఆధ్వర్యంలో ఈ కా ర్యక్రమం జరిగింది.

గౌడ జాతి ధైర్యం, పో రాట స్ఫూర్తికి ప్రతీకలైన మహనీయుల విగ్రహాల నిర్మాణం శుభపరిణామమని గౌడ సం ఘం పెద్దలు సర్పంచ్ విజేందర్ గౌడ్, వెం కట్ గౌడ్, బలరాం గౌడ్ లు అన్నారు. గౌడ లు ఐకమత్యంతో ఉండి విగ్రహాల ఏర్పాటు ను విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు.