30 March, 2026 | 2:34 AM

ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్న రామ్మోహన్

30-03-2026 12:58 AM

మహబూబాబాద్, మార్చి 29 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర భాష ఉపాధ్యాయ సంస్థ ఆదివారం హనుమకొండలో నిర్వహించిన ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు 2026 కార్యక్రమంలో మహబూబాబాద్ జిల్లా మరిపెడ ఉన్నత పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్న బయగాని రామ్మోహన్ కు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందజేశారు. విద్యారంగ అభివృద్ధి లక్ష్యంగా విద్యార్థుల సేవే పరమావధిగా ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తూ గురు బ్రహ్మగా నిలుస్తున్న రామ్మోహన్ కు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం దక్కడం పట్ల హర్షం వ్యక్తం అవుతుంది.

ఈ సందర్భంగా రామ్మోహన్ కు ప్రశంసా పత్రం అందజేసి, శాలువా, మె మెంటో తో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ములుగు డీఈఓ సిద్ధార్థ రెడ్డి, ఏఎమ్‌ఓ శ్యాంసుందర్ రెడ్డి, సినీ గేయ రచయిత మిట్టపల్లి సురేందర్, ఎస్‌ఎల్టిఏ రాష్ట్ర అధ్యక్షులు చక్రవర్తుల శ్రీనివాస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్రెం గౌరీ శంకర్రావు, ఎల్టా రాష్ట్ర అధ్యక్షులు టి. వెంకటేశ్వరరావు, రాష్ట్ర బాధ్యులు డాక్టర్ రవికుమార్, మహబూబాబాద్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ బి. సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.