ఎలక్ట్రికల్ బస్‌లో మంటలు
30-03-2026 12:56 AM
హనుమకొండ,మార్చి 29( విజయక్రాంతి): హనుమకొండ కేంద్రంలోని వరంగల్ - 2 డిపోకు చెందిన ఎలక్ట్రిక్ బస్సు ఛార్జిం గ్ చేస్తుండగా కింది భాగంలో మంటలు చెలరే గాయి. అప్రమత్తమైన సిబ్బంది వెంట నే మంటలు ఆర్పి వేశారు. ఈ విషయంపై డిపో మేనేజర్ రవిని వివరణ కోరగా ఎలక్ట్రిక్ బస్సులో 12 బ్యాటరీలు ఉంటాయని, అందులో ఒక బ్యాటరీలో మంటలు వచ్చాయని తెలిపారు. డ్యూటీలో ఉన్న సిబ్బంది వెంటనే మంటలను చల్లార్చి అదుపులోకి తీసుకొ చ్చారని, ఎలాంటి నష్టమూ జరగలేదని తెలిపారు.




