11 April, 2026 | 4:00 AM

శ్రీనగర్ కాలనీలో రాంబో సర్కస్

11-04-2026 01:47 AM

ప్రారంభించిన ఎమ్మెల్యే నవీన్ యాదవ్

జూబ్లీహిల్స్, ఏప్రిల్ 10(విజయక్రాంతి): శ్రీనగర్ కాలనీ డివిజన్లోని శ్రీ సత్య సాయి నిగమంలో ఏర్పాటు చేసిన రాంబో సర్కస్ను జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

శుక్రవారం ఈ ప్రారంభోత్సవం సందర్భంగా సర్కస్ కళాకారులు ప్రదర్శించిన సాహసోపేతమైన విన్యాసాలను వీక్షించిన ఎమ్మెల్యే వారి అద్భుత ప్రతిభను, కష్టపడే తత్వాన్ని ప్రత్యేకం గా అభినందించారు. ఇలాంటి వినోదాత్మక కార్యక్రమాలు ప్రజలకు ఆహ్లాదాన్ని పంచడమే కాకుండా, కళాకారులకు తగిన ప్రోత్సా హాన్ని అందిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకు లు, పెద్ద సంఖ్యలో ప్రజలు, చిన్నారులు పాల్గొని సర్కస్ ప్రదర్శనలను ఆస్వాదించారు.