11 July, 2026 | 7:56 PM

రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ ఆధ్వర్యంలో నోట్‌ బుక్స్ పంపిణీ

11-07-2026 07:19 PM

చుంచుపల్లి,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చుంచుపల్లి మండలం బాబు క్యాంప్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల (పీఎంశ్రీ ) లో రాష్ట్రీయ లోక్.దళ్ పార్టీ ఆధ్వర్యంలో నోట్‌ బుక్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భద్రాద్రి జిల్లా అధ్యక్షులు కట్ట సతీష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “సెకండ్ ఛాన్స్ ఫౌండేషన్” ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా నోట్‌ బుక్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగా బాబు క్యాంప్  ప్రభుత్వ ఉన్నత  పాఠశాల (పీఎంశ్రీ ) లో నోట్ బుక్స్ పంపిణీ చేస్తున్నామన్నారు. రాష్ట్రీయ లోక్ దళ్ స్టూడెంట్ వింగ్ జిల్లా అధ్యక్షులు  పృధ్వి నాయక్ అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.