11 July, 2026 | 8:26 PM

Breaking News

అంబేద్కర్ విగ్రహ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధం   •   దివ్యాంగురాలిని ఆప్యాయంగా పలకరించిన జిల్లా కలెక్టర్   •   పినపాక మండలంలో ఎస్ఐఆర్ ప్రోగ్రామ్   •   శాతవాహన క్రీడా మైదానంలో 'సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్' నిర్మాణానికి భూమి పూజ   •   ఈనెల 13న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భూపాలపల్లి జిల్లా పర్యటన   •   మొదటి వేతనంతో పాఠశాలకు సౌండ్ సిస్టం అందించిన సర్పంచ్   •   లింగాపూర్ స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం   •   మత్తు పదార్థాలు, సామాజిక మాధ్యమాల దుర్వినియోగం, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి   •   బాన్సువాడ జామ మసీద్ నూతన అధ్యక్షునికి ఘన సన్మానం   •   బెజ్జంకిలో ఘనంగా బండి సంజయ్ జన్మదిన వేడుకలు   •  

ముగిసిన ఐడీఈ బూట్‌క్యాంప్

11-04-2026 01:45 AM

సీఎంఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఐదు రోజుల పాటు నిర్వహణ

హైదరాబాద్, ఏప్రిల్ 10(విజయక్రాంతి) : కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ, ఏఐసీటీఈ, ఎంఓఈ ఇన్నోవేషన్ సెల్ సంయుక్త ఆధ్వర్యంలో సీఎంఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన ఐదు రోజుల ఐడీఈ బూట్‌క్యాంప్ (ఎడిషన్ 3 ఫేజ్ 1) శుక్రవారంనాడు ఘనంగా ముగిసింది.

దేశవ్యాప్తంగా వచ్చిన 257 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని, ఆవిష్కరణలు, వ్యవస్థాపకతపై శిక్ష ణ పొందారు. ముగింపు వేడుకలో కళాశాల కార్యదర్శి సీహెచ్ శ్రీశైలంరెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ. శ్రీనివాసుల రెడ్డి, ఎంఓఈ ఇన్నోవేషన్ సెల్ మేనేజర్ డాక్టర్ భీమ లింగేశ్వర్ రెడ్డి, వాధ్వానీ ఫౌండేషన్ ప్రతినిధి శ్యామ్ పెరికా ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

ముఖ్య అంశాలు:

పిచ్చింగ్ సెషన్: మొత్తం 68 బృందాలు ఆరోగ్యం, వ్యవసాయం, సుస్థిరత వంటి రంగాల్లో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారంగా తమ నమూనాలను ప్రదర్శించాయి.

బహుమతులు: అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన టాప్ 5 బృందాలకు మెరిట్ సర్టిఫికె ట్లు మిగిలిన వారందరికీ పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు అందజేశారు. విద్యార్థుల్లో సృజనాత్మ కత, ‘డిజైన్ థింకింగ్’ పెంచడంలో  క్యాంప్ విజయవంతమైందని కొనియాడారు.కన్వీనర్లు డాక్టర్ సుమన్ మిశ్రా, డాక్టర్ ఎం. లక్ష్మ య్య కృతజ్ఞతలతో కార్యక్రమం ముగిసింది.