11 July, 2026 | 8:10 PM

Breaking News

మొదటి వేతనంతో పాఠశాలకు సౌండ్ సిస్టం అందించిన సర్పంచ్   •   లింగాపూర్ స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం   •   మత్తు పదార్థాలు, సామాజిక మాధ్యమాల దుర్వినియోగం, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి   •   బాన్సువాడ జామ మసీద్ నూతన అధ్యక్షునికి ఘన సన్మానం   •   బెజ్జంకిలో ఘనంగా బండి సంజయ్ జన్మదిన వేడుకలు   •   ఎస్‌ఐఆర్–2026ను పారదర్శకంగా నిర్వహించాలి   •   ఫైవ్ స్టార్ రేటింగ్ సాధించటం గర్వకారణం   •   రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ ఆధ్వర్యంలో నోట్‌ బుక్స్ పంపిణీ   •   బిఆర్ఎస్ నేతలను అరెస్టు చేసిన పోలీసులు   •   సమయంలోపు ఎస్ఐఆర్ ఫాంలను అందించాలి: ఈఆర్ఓ ఎన్. జగదీశ్వర్ రెడ్డి   •  

బిఆర్ఎస్ నేతలను అరెస్టు చేసిన పోలీసులు

11-07-2026 07:16 PM

శంకర్ పల్లి,(విజయక్రాంతి): షాబాద్ మండలంలో హత్యకు గురైన కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్తున్న బి ఆర్ ఎస్ నేతలను శనివారం పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు. మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో పాటు నాయకులను మార్గమధ్యంలోనే అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని శంకర్ పల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. శాంతి భద్రతల దృష్ట్యా ముందస్తు చర్యగా అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ శంకర్ పల్లి పోలీస్ స్టేషన్లో విలేకరులతో మాట్లాడుతూ... రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో తెలంగాణ ఫోక్సో కేసులకు అడ్డగా మారిందని విమర్శించారు.

అరెస్టు చేయవలసింది మమ్మల్ని కాదని ఆరుగురుని నిర్ధాక్షణంగా చేసిన నిందితుడిని అరెస్టు చేయాలని సూచించారు. నేరం జరిగే 55 రోజులైనా ఇంతవరకు పోలీసులు నిందితుని అరెస్టు చేయకపోవడం శోచనీయమన్నారు. పోలీసులు అంతా రేవంత్ రెడ్డి వారి సోదరులను కాపాడుకోవడంలో బిజీగా ఉన్నారని తెలిపారు. బాధ్యత కుటుంబాలను పరామర్శించి న్యాయం కోసం షాబాద్ పోదామని బయలుదేరితే చేవెళ్లలో పోలీసులు నన్ను, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం రెడ్డిని అరెస్టు చేసి శంకర్ పల్లి పోలీస్ స్టేషన్లో బంధించారని, మాజీ మాజీ మంత్రులు సబితా రెడ్డి, సత్యవతి రాథోడ్ లను కూడా అరెస్టు చేసి ఇతర పోలీస్ స్టేషన్లకు తరలించారని చెప్పారు.

షాబాద్ పోలీసుల అలసత్వం వల్లనే ఈ ఆరు హత్యలు జరిగాయని ఆరోపించారు. బిఆర్ఎస్ నేతలను అరెస్టు చేసి శంకర్ పల్లి పోలీస్ స్టేషన్కు తరలించారని సమాచారం తెలుసుకున్న మండల మండల బి ఆర్ ఎస్ నేతలు పోలీస్ స్టేషన్కు చేరుకొని సంఘీభావం తెలిపారు. మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జి.గోవర్ధన్ రెడ్డి, గుడిమల్కాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ డి. వెంకట్ రెడ్డి. శంకర్ పల్లి పిఎసిఎస్ చైర్మన్ బద్దం శశిధర్ రెడ్డి, మాజీ ఎంపీపీ డి. గోవర్ధన్ రెడ్డి, శంకర్ పల్లి మాజీ సర్పంచ్ బి. శ్రీధర్, నాయకులు వాసుదేవ్ కన్నా, పలు గ్రామాలకు సర్పంచులు, నాయకులు  ఉన్నారు.