calender_icon.png 13 February, 2026 | 3:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శిలల్లో శివత్వం.. రామప్ప మహిమ

13-02-2026 12:33:43 AM

చరిత్రలో చిరస్మరణీయంగా ‘రామప్ప’

రామప్పలో మహాశివరాత్రి మహోత్సవాలు

మూడు రోజుల పాటు ఆధ్యాత్మిక వైభవం

శివనామస్మరణతో మారుమోగనున్న రామప్ప

వెంకటాపూర్,ఫిబ్రవరి12,(విజయక్రాంతి): తెలంగాణ భూమిపై భక్తి, భవ్యం, భరితమైన చరిత్రకు ప్రతీకగా నిలిచిన రామప్ప శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం మరోసారి మ హాశివరాత్రి కళ్యాణ జాగరణ మహోత్సవాలకు సిద్ధమైంది.. ఈ నెల 15 నుండి 17 వరకు జరిగే ఈ మహోత్సవం కేవలం ఒక పండుగ మాత్రమే కాదు అది భక్తి ప్రవా హం, ఆధ్యాత్మిక అనుభూతి, శైవ సంప్రదాయాల సజీవ ప్రతిరూపం..

భక్తి, భవ్యం, భరితమైన మూడు రోజుల ఆధ్యాత్మిక వైభవం

తొలిరోజు 15వ తేదీన మహాశివరాత్రి నాడు ఉదయం మంగళవాయిద్యాల మధ్య స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తారు. పాలు, పెరుగు, తేనె, చందనం, బి ల్వదళాలతో జరిగే మహాభిషేకం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఉదయం అర్చనలు, కం కణధారణ కార్యక్రమాలు జరుగుతాయి. రా త్రి సమయంలో శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవం భక్తుల సమక్షంలో ఘనంగా నిర్వహించబడుతుంది. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ ఉంటుంది. రెండో రోజు 16 వ తేదీన సోమవారం సందర్భంగా ఉద యం నుంచే రుద్రాభిషేకాలు, లఘు రుద్రా లు నిర్వహిస్తారు.

భక్తులు స్వయంగా పాల్గొ ని సేవలు చేయవచ్చు. సాయంత్రం భక్తి గీ తాలాపనలు, హరినామ సంకీర్తనలు, దీపారాధనలు జరుగుతాయి. అగ్గి గుం డా ల కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. భ క్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొంటారు. మూడో రోజు 17వ తేదీన మంగళవారం ఉదయం గణపతి హోమం, నాగబలి, పూర్ణాహుతి  కా ర్యక్రమాలు నిర్వహించబడతాయి.ఉత్సవాల ముగింపు సం దర్భంగా ప్రత్యేక మహామంగళహారతి ఇస్తారు. భక్తులందరికీ అన్నదాన కా ర్యక్రమం ఏర్పాటు చేస్తారు.నిత్యపూజలు మరి యు సేవా కార్యక్రమాలు దేవస్థానంలో ప్రతిరోజు రుద్రాభిషేకం, అర్చన, శాశ్వత పూ జలు నిర్వహించబడనున్నాయి.

చరిత్రలో చిరస్మరణీయం రామప్ప దేవాలయం

క్రీ.శ. 1213లో కాకతీయుల కాలంలో ని ర్మితమైన ఈ దేవాలయం శిల్పకళా వైభవానికి ప్రతీకగా నిలిచింది. రేచర్ల రుద్రు డు ని ర్మించిన ఈ కట్టడం కాకతీయుల సాంస్కృతిక మహిమను ప్రతిబింబిస్తుంది. ప్రత్యేక శై లిలో నిర్మించిన సాండ్బాక్స్ టెక్నాలజీ, సున్నపురాయి శిల్పాలు, నర్తకుల శిల్పవైభవం, వి రాజిల్లే నంది విగ్రహం ఈ దేవాలయాన్ని వి శిష్టంగా నిలబెట్టాయి. ఈ ఆలయంలో ప్రతి రాయి శివనామాన్ని జపిస్తున్న ట్టుగా అనిపిస్తుంది.

శిల్పాలలో నర్తించే అప్సరసలు, గంభీరం గా దర్శనమిచ్చే నంది, శాస్త్రీయ నిర్మాణ శైలి ఇవన్నీ కలిసి ఈ క్షేత్రాన్ని కేవలం దేవాలయంగా కాకుండా ఒక దివ్యానుభూతిగా మలిచాయి. యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితా లో చోటు సంపాదించడంతో రామప్ప క్షేత్రం అంతర్జాతీయ ఖ్యా తిని పొందింది. ఈ ఆలయం ఇప్పుడు మహాశివరాత్రి సందర్భంగా భక్తి తరంగాలతో కళకళలాడనుంది..

మహాశివరాత్రి ఉత్సవాల విశిష్టత

మహాశివరాత్రి హిందువుల పర్వదినాలలో అత్యంత పవిత్రమైనది. ఈ సందర్భంగా స్వామివారికి జరిగే అభిషేకాలు, రుద్రపారాయణాలు, జాగరణలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందిస్తాయి. రామలింగేశ్వర స్వామి ఆలయంలో జరిగే బ్రహ్మోత్సవాలు ప్రత్యేకంగా ప్రసిద్ధి చెందాయి.

తెలంగాణ ఆధ్యాత్మిక గర్వకారణం

రామప్ప దేవాలయం కేవలం ఆధ్యాత్మిక క్షేత్రమే కాదు, తెలంగాణ చరిత్ర, సంస్కృతి, శిల్పకళలకు ప్రతీక. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ క్షేత్రం భక్తి, భవ్యం, భ రితమైన వాతావరణంతో కళకళలాడనుంది. మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకలు భక్తుల హృదయాల్లో దివ్యానుభూతిని నింపనున్నాయి. ఓం నమః శివాయ నినాదాలతో మా ర్మోగే రామప్ప క్షేత్రం భక్తులకు ఆధ్యాత్మిక పరవశాన్ని అందించనుంది.

భక్తుల సౌకర్యం, భద్రతే మా ప్రధాన లక్ష్యం

ఈ నెల 15వ తేదీన జరగనున్న మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ పరిసరాలు, పార్కింగ్ స్థలం తదితర ప్రాంతాలను ప రిశీలించడం జరిగింది. భక్తులకు ఎ టువంటి అసౌకర్యం కలగకుండా అన్ని విధాలా తగిన చ ర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశిం చాం. ముఖ్యంగా తాగునీటి సదుపాయం, పారిశుధ్య నిర్వహణ, రవాణా సౌకర్యా లు, భద్రతా ఏర్పాట్లు వంటి అం శాల్లో ప్రత్యేక దృష్టి సారించాలని సూచించాం. మహాశివరాత్రి సందర్భంగా భా రీగా భక్తులు తరలివచ్చే అవకాశ మున్నందున ముందస్తు ప్రణాళికతో సమగ్ర ఏర్పాట్లు చేయాలని అధికారులను అప్రమత్తం చేశాం. భక్తుల సౌకర్యం, భద్రతే ప్రధాన లక్ష్యంగా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి.

మంత్రి సీతక్క