మొలకెత్తుతున్న విత్తనం.. అయినా రైతుల్లో ఆందోళన
మొదట్లోనే పెరిగిన పంట, పెట్టుబడి
బోథ్, జూన్ 30(విజయక్రాంతి): వర్షాకాలం లో వర్షాలు ఆశించిన స్థాయిలో కురువకపోవడం వల్ల రైతుల్లో ఆందోళన నెలకొంది. భూమిలో విత్తనాలు వేద్దామా వద్దా అన్న సందేహంలో రైతులు విత్తనాలు వేయడం జరిగింది. అయితే వరు ను డు దోబూచులాడడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. విత్తనాలు నాటిన రైతులు వారం రోజులపాటు నింగికి మొహం వేసి వరుణుడి కరుణ కోసం వేసి చూశారు. అయితే వర్షాలు కురవడం ఆలస్యం కావడంతో వేలాది ఎకరాలలో నాటిన విత్తనాలు మొలకెత్తలేదు దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.
ఖరీఫ్ సాగు కష్టాలమయం
ఏడాది ఖరీఫ్ పంట సాగు మొదట్లోనే తమను కష్టాల్లోకి నెట్టిందని రైతులంటున్నారు. విత్తనాలు వేసిన తర్వాత సకాలంలో వర్షాలు కురవకపోవడంతో పంట మొలకెత్తలేదు దీంతో రెండవసారి విత్తనాలు కొనుగోలు చేసి వచ్చింది. పెరిగిన ఎరువుల ధరలతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వేసిన పంటను రెండుసార్లు వేయాలంటే ఖర్చులు తడిసి మోపిడుగుతున్న య ని రైతులంటున్నారు.
మొలకెత్తిన విత్తనం అయినా ఆందోళన
అప్పుడప్పుడు కురిసిన వర్షాల వల్ల విత్తనం మొలకెత్తింది. మొలకెత్తిన విత్తనాలకు సరిపడా వర్షాలు కురవక పోతే పంట నష్టపోవాల్సి వస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది రైతులు అధిక మొత్తంలో పత్తి పంటను సాగు చేస్తున్నారు. వర్షాలు సకాలంలో కురిస్తే రైతులు ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడే ఆస్కారం ఉంది లేకుంటే కరువు తప్పదని అంటున్నారు.






