30 June, 2026 | 10:54 AM

కామారెడ్డి జిల్లాలో యూరియా కష్టాలు

30-06-2026 09:52 AM
  1. యాప్ లో బుక్ చేసిన యూరియా మాయం
  2. మాచారెడ్డి సొసైటీ దగ్గర రైతుల ఆందోళన
  3. అధికారులతో రైతుల వాగ్వాదం, ఉద్రిక్తత

కామారెడ్డి : తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలో రైతులు యూరియా(Urea) కోసం ఇబ్బందులు పడుతున్నారు. కామారెడ్డి జిల్లాలో(Kamareddy District) యూరియా కష్టాలు కొనసాగుతున్నాయి. యాప్ లో బుక్ చేసిన యూరియా సొసైటీ నుంచి మాయం అయింది. దీంతో మాచారెడ్డి సొసైటీ(Machareddy Society) దగ్గర రైతులు ఆందోళన చేస్తున్నారు. 25 మంది రైతులకు చెందిన 120 యూరియా బస్తాలు గల్లంతయ్యాయయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యూరియా ఇచ్చామని సొసైటీ అధికారులు(Society officials) సమాధానం చెబుతున్నారు. అధికారులతో రైతులు వాగ్వాదానికి దిగారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది.