22 March, 2026 | 1:07 PM

కులమతాలకు అతీతం రంజాన్

22-03-2026 12:00 AM

గాంధీనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఏ పావని వినయ్ కుమార్

ముషీరాబాద్, మార్చి 21(విజయక్రాంతి): ఉపవాస దీక్షలు పూర్తి చేసుకొని శనివారం రంజాన్ పండుగను జరుకున్న డివిజన్ ముస్లిం సోదరులకు, మహిళలకు గాంధీనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఎ. పావని వినయ్ కుమార్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి పండుగను కులమతాలకు అతీతంగా డివిజన్ ప్రజలు జరుపుకోవడం అనేది ‘గంగా,  జమున, తహేజీబ్‘ కు నిదర్శనం అని మాజీ కార్పొరేటర్  అన్నారు.

డివిజన్ మైనారిటీ మోర్చ సీనియర్ నాయకులు మొహమ్మద్ మహమూద్,  రహమా త్ అలిలను శాలువాతో సన్మానించి వారి కుటుంబ సభ్యులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్  ఎ. వినయ్ కుమార్  ఈ కార్యక్రమంలో బీజేపీ డివిజన్ అధ్యక్షుడు వి. నవీన్ కుమార్, సీనియర్ నాయకులు రత్న సాయి చంద్, శ్రీకాంత్, పీ. నర్సింగ్ రావు, ఎం. ఉమేష్, రాజు, సురేష్ రాజు తదితరులు పాల్గొన్నారు.