6 July, 2026 | 6:43 PM

ఆలయ హుండీ ఆదాయం రూ.2.57 లక్షలు

06-07-2026 05:50 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలోని శ్రీ గండి రామన్న దత్త సాయిబాబా ఆలయంలో సోమవారం హుండీ లెక్కింపును నిర్వహించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ సూపరింటెండెంట్ రంగు రవికిషన్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ లెక్కింపులో భక్తులు సమర్పించిన కానుకల రూపంలో మొత్తం రూ.2,57,700 ఆదాయం సమకూరింది. హుండీ లెక్కింపును పారదర్శకంగా నిర్వహించగా, ఆలయ ఇన్‌చార్జి ఈవో భూమయ్య, సాయిబాబా భక్తులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. ఆలయ అభివృద్ధి, నిత్య నిర్వహణకు భక్తులు అందిస్తున్న సహకారం అభినందనీయమని అధికారులు తెలిపారు.