రహదారుల నిర్మాణానికి నిధుల మంజూరు.. హర్షం వ్యక్తం చేసిన కాంగ్రెస్ నాయకులు
రుద్రంగి,(విజయక్రాంతి): రహదారుల నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎర్రం గంగనర్సయ్య ఆధ్వర్యంలో హర్షం వ్యక్తం చేస్తూ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రం గంగానర్సయ్య మాట్లాడుతూ... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 30 సంవత్సరాల క్రితం తనను జడ్పిటిసి గా గెలిపించి అండగనిలిచిన మిడ్జల్ ప్రజలకు కృతజ్ఞత తెలుపుతూ అభివృద్ధి పనులు ఎలా ప్రారంభించారో అదే విదంగా వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కూడా తనను 30 సంవత్సరాలు గా ఆదరిస్తున్న నియోజకవర్గ ప్రజలకు అలాగే జడ్పిటిసిగా ఆదరించిన ఉమ్మడి చందుర్తి రుద్రంగి మండలాల ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ,అన్ని రంగాల్లో అభివృద్ధి సంక్షేమ పథకాలు తీసుకవస్తున్నారని అన్నారు. 2 కోట్లతో పోలీస్టేషన్ భవనం,2 కోట్లతో ఏమ్మార్వో ఆఫీసులకు నిధులు మంజూరు చేయడం జరిగిందని తాజాగా రహదారుల నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం హర్షణీయమని అన్నారు
. సర్పంచ్ గండి నారాయణ మాట్లాడుతూ.గత పది సంవత్సరాలుగా అధికారంలో ఉన్న గత బిఅరెస్ పాలకులు రహదారిని పట్టించుకోలేదని అన్నారు. నియోజకవర్గ సమస్యలు ప్రజల కష్టాలు తెలిసిన వాడిగా ప్రభుత్వ విప్ నియోజకవర్గన్నీ అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. మార్కెట్ కమిటీ చెర్మన్ చేలుకల తిరుపతి మాట్లాడుతూ... నియోజకవర్గ అభివృద్ధి ద్యేయంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు.రహదారుల నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి,మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు కృతజ్ఞతలు తెలిపారు.






