మెడికవర్‌లో ఫ్యామిలీ డెంటల్ ప్యాకేజీలు
వరల్డ్ ఓరల్ హెల్త్ డే సందర్భంగా ప్రారంభం
హైదరాబాద్, మార్చి 20 (విజయక్రాంతి): ప్రపంచ మౌఖిక ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని హైటెక్ సిటీలోని మెడికవర్ హాస్పిటల్స్ ప్రత్యేక దంత ఆరోగ్య అవ గాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. స్మైల్ బ్రైటర్ దిస్ సమ్మర్ అనే థీమ్‌తో కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేక డెంటల్ ప్యాకేజీలు, సీనియర్ సిటిజన్స్ కోసం ఉచిత దంత పరీక్ష కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అతిథులుగా నటి నభా నటేష్, నటుడు రాజా రవీంద్రతో పాటు డా. ఎ.శరత్‌రెడ్డి (ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్), పి. హరికృష్ణ (ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మెడికవర్ హాస్పిటల్స్ ఇండియా) హాజరయ్యారు. సీనియర్ సిటిజన్స్ కోసం ఏప్రిల్ 15 వరకు ఉచిత డెంటల్ చెకప్ సౌకర్యాన్ని ప్రకటించారు.
సమ్మర్ స్పెషల్ ఫ్యామిలీ డెంటల్ ప్యాకేజీలో కుటుంబ సభ్యులకు డెంటల్ కన్సల్టేషన్, డి జిటల్ ఓపీజీ ఎక్స్-రే సౌకర్యం, అలాగే అన్ని డెంటల్ ట్రీట్‌మెంట్స్‌పై 30 శాతం తగ్గింపు అందిస్తున్నారు. ఈ ప్యాకేజీని ప్రత్యేక రాయి తీ ధర రూ.1,999కు అందుబాటులో ఉంచా రు. ఈ ఆఫర్ జూన్ 30 వరకు ఉంటుంది. కార్యక్రమంలో వైద్య నిపుణులు డా. సి. శరత్ బాబు, ప్రోస్థోడాంటిస్ట్ అండ్ ఇంప్లాంటాలజిస్ట్, మహేష్ డెగ్లూర్కర్, చీఫ్ బిజినెస్ ఆఫీసర్ మెడికవర్ హాస్పిటల్స్ పాల్గొన్నారు.




