6 July, 2026 | 6:34 PM

మిషన్ భగీరథ పైపు పగిలి వృథా అవుతున్న తాగునీరు

06-07-2026 05:20 PM

గంభీరావుపేట,(విజయక్రాంతి): గంభీరావుపేట మండల కేంద్రంలోని నర్మాల రోడ్డుపై ప్రధాన రహదారి పక్కన మిషన్ భగీరథ పైపు పగిలిపోవడంతో తాగునీరు వృథాగా పోతుంది. విద్యుత్ వైర్ల కింద పెరిగిన చెట్లను జెసిబి సహాయంతో తొలగించే సమయంలో భూమిలో ఉన్న పైపు దెబ్బతినడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.దీంతో పెద్ద మొత్తంలో మంచినీరు వృథా అవుతుండగా, స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి పైపును మరమ్మతు చేసి నీటి వృథాను అరికట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.