శ్యాం ప్రసాద్ ముఖర్జీ జీవితం స్ఫూర్తిదాయకం
బిజెపి పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు
ముకరంపుర,(విజయక్రాంతి): భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ స్ఫూర్తిదాయకమని బిజెపి పార్లమెంటు కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు అన్నారు . సోమవారం రోజున కరీంనగర్లోని పార్లమెంట్ కార్యాలయంలో శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్లమెంట్ కన్వీనర్ బోయిన్‌పల్లి ప్రవీణ్ రావు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అఖండ భారతం కోసం "ఒకే దేశంలో రెండు జెండాలు, ఇద్దరు ప్రధాన మంత్రులు ఉండకూడదన్నది శ్యాం ప్రసాద్ ముఖర్జీ బలంగా నమ్మిన సిద్ధాంతం.
దేశ సమగ్రత కోసం ఆయన చేసిన పోరాటం ప్రతి భారతీయుడికి స్ఫూర్తిదాయకం" అని పేర్కొన్నారు.ముఖర్జీ కేవలం రాజకీయ నాయకుడిగానే కాకుండా, అసాధారణమైన విద్యావేత్తగా, జాతీయవాదిగా దేశానికి విశేష సేవలు అందించారని కొనియాడారు. నేటి తరం యువత శ్యాంప్రసాద్ ముఖర్జీ త్యాగాలను, దేశం పట్ల ఆయనకు ఉన్న నిబద్ధతను గుర్తుచేసుకోవాలని, ఆయన చూపిన బాటలో పయనించి దేశాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.






