సెంట్రల్ వర్క్ షాప్ కాంట్రాక్ట్ కార్మికులకు రక్షణ పరికరాలు పంపిణీ
06-07-2026 05:31 PM
కొత్తగూడెం,(విజయక్రాంతి): సింగరేణి కొత్తగూడెం కార్పొరేట్ పరిధిలో గల సెంట్రల్ వర్క్ షాప్, బిపవర్ హౌస్, 132 కెవి సబ్ స్టేషన్ కాంట్రాక్ట్ కార్మికులకు సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ -ఐ టీ యూ సి నాయకుల చేతుల మీదుగా రక్షణ పరికరాలను సోమవారం నాడు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ రక్షణ పరికరాలను ఉపయోగించి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా, గాయాల పాలు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.యూనియన్ విజ్ఞప్తి మేరకు సెంట్రల్ వర్క్ షాప్ హౌస్ కీపింగ్ కార్మికులకు షూస్,హెల్మెట్లు అందజేసిన కాంట్రాక్టర్ ఎం నరసింహారావు కి యూనియన్ నాయకులు కృతజ్ఞతలు తెలియజేశారు.






